ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర

ఏటా సాగే అమర్‌నాథ్‌ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్ములోని భాగవతి నగర్‌ క్యాంపు నుంచి మొదటి యాత్రికుల బృందం మంచు లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరారు.

ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర
X

దక్షిన కశ్మీర్‌లోని మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి ఏటా సాగే అమర్‌నాథ్‌ యాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. జమ్ములోని భాగవతి నగర్‌ క్యాంపు నుంచి మొదటి యాత్రికుల బృందం మంచు లింగాన్ని దర్శించుకోవడానికి బయలుదేరారు. తెల్లవారుజామున 48 కిలోమీటర్ల పొడవైన అనంతనాగ్‌ జిల్లాలోని నున్వాన్‌-పహల్గాం, గందర్బాల్ జిల్లాని 18 కిలోమీటర్ల బల్టాట్‌ మార్గాల నుంచి యాత్ర ప్రారంభమైనట్టు అధికారులు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా శుక్రవారం జమ్ము భగవతి నగర్‌లోని యాత్రి నివాస్‌ బేస్‌ క్యాంపు నుంచి 4, 604 యాత్రికుల తో కూడిన తొలి బృందానికి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. యాత్ర సజావుగా సాగడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌, ఇతర పారా మిలటరీ బలగాలకు చెందిన వేలాది మంది సిబ్బంది భద్రతా విధుల్లో ఉన్నారు. వైమానిక నిఘాను నిర్వహిస్తున్నారు.

52 రోజుల పాటు సాగే ఈ పాదయాత్ర ఆగస్టు 19న ముగియనున్నది. ఈ యాత్ర కోసం ఇప్పటివరకు 3.5 లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఆ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story