ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి : చంద్రబాబు

విశాఖ, కర్నూలు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు

Chandrababu naidu
X

ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని చంద్రబాబు ఉంటుందని తెలిపారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందాం గత ముఖమంత్రి జగన్ విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని బాబు అన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సమయస్ఫూర్తి ఎప్పటికీ మరిచిపోలేనని చంద్రబాబు చెప్పారు. తాను జైలులో ఉన్నప్పుడు పవన్‌ వచ్చి పరామర్శించారని.. అక్కడే టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలిపారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బిజెపి, టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుందని అన్నారు. కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

రాష్ట్రంలో నదులు అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తాం. ప్రజస్వామ్యయుతంగా ప్రజాహితం కోసం పనిచేస్తామని చెప్పారు. కర్నూలుని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అమరాతికి మళ్లీ పూర్వవైభవం రానుంది. రాజధానిలో నిలిచిపోయిన పనులకు త్వరలో మహర్ధశ పట్టుంది. ఎన్డీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణ, ఏలూరు జిల్లాల పరిధిలో CRDA విస్తరించింది. దాదాపు 8 వేల 352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి కళకళలాడబోతోంది. రాజధాని నిర్మాణం, మిగతా అంశాలన్నీ పూర్తి చేయడానికి కార్యచరణ రూపొందిస్తున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story