హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌

రెండు రోజుల సదస్సును నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌
X

ఇంటర్నేషనల్‌ ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. నేడు, రేపు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో సదస్సు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరికి కృత్రిమ మేధస్సును అందించాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నది. ఈ తరహా ఏఐ సదస్సును దేశంలో మొదటిసారి నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు.

ప్రపంచ నలుమూలల నుంచి కృత్రిమ మేధో రంగంలో పేరొందిన ప్రముఖులు, వివిధ సంస్థల ప్రముఖులు 2000 మంది ఈ సదస్సులో పాల్గొననున్నారు. సమాజంపై ఏఐ ప్రభావం- నియంత్రణ- సవాళ్లపై సదస్సులు చర్చించనున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్‌ డెమోలు, అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు అందులో ప్రదర్శించనున్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లో నిర్మించనున్న ఫోర్త్‌ సిటీలో 200 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐటీ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, రాష్ట్రంలోని అనుకూల వాతావరణాన్ని వివరించేలా ఈ ఏఐ గ్లోబల్‌ సదస్సును నిర్వహించనున్నారు. సుమారు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన అనంతరం రోడ్‌ మ్యాప్‌ను సీఎం విడుదల చేస్తారు.

Raju

Raju

Writer
    Next Story