ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అదనపు ఆదాయం: పొన్నం

రైతులు తమ పొలాల్లో ఆయిల్‌ పామ్‌ సహా పండ్ల తోటలు, కూరగాయలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక ఆదాయం వస్తుందని మంత్రి పొన్నం తెలిపారు.

ఆయిల్‌ పామ్‌ సాగుతో రైతులకు అదనపు ఆదాయం: పొన్నం
X

ఆయిల్‌ పామ్‌పై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. హనుమకొండ జిల్లా మల్లారంలో ని రైతు వేదికలో వ్యవసాయ ఆధారిత అనుబంధిత రంగాల పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ రైతులు తమ పొలాల్లో ఆయిల్‌ పామ్‌ సహా పండ్ల తోటలు, కూరగాయలు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకంపై దృష్టి సారిస్తే అధిక ఆదాయం వస్తుందన్నారు.

అర్హులైన రైతులకు వ్యవసాయ రుణాలు ఇప్పించే బాధ్యత స్వయంగా తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఎక్కడైనా రుణమాఫీ పరంగా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కారణాలు చెప్పడానికి ఏఈవో దగ్గర మొత్తం డేటా ఉన్నదన్నారు. పాడి పరిశ్రమ విషయంలో ఈ మండలాన్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమాలు బాగున్నాయన్నారు.

Raju

Raju

Writer
    Next Story