బాలీవుడ్ పార్టీలపై నటి కంగనా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్లో జరిగే పార్టీలపై నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్‌పై విమర్శలు గుప్పించింది
- By VamshiLoading...
- | 18 Aug 2024 6:18 AM GMT
X
X
బాలీవుడ్ పార్టీలపై నటి కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను బాలీవుడ్‌కు సరిపోయే వ్యక్తిని కాదన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్లో ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలిపారు. . వాళ్లందరి లైఫ్ స్టైల్ వేరు. నా లైఫ్ వేరు. ఇక బాలీవుడ్ పార్టీల్లో వారు మాట్లాడుకునే మాటలు నాకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.
నా దృష్టిలో బాలీవుడ్ పార్టీలంటే ‘ఓ ట్రామా’. ” అని కంగన చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్స్ లేకపోతే.. మార్నింగ్ జిమ్ చేయడం, మధ్యాహ్నం నిద్రపోవడం, మళ్లీ సాయంత్రం కసరత్తులు చేయడం, టీవీ చూడడం, పడుకోవడం ఇదే నా రొటీన్ లైఫ్ అన్నారు. కంగన నటించిన ఎమర్జెన్సీ మూవీ సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రానుంది. ప్రస్తుతం కంగన ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
Vamshi
Writer
Next Story