శ్రీశైలం పవర్‌ హౌస్‌ లో ప్రమాదం

ఏపీ జెన్‌ కో పవర్‌ స్టేషన్‌ లో స్పార్క్స్‌.. విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం

శ్రీశైలం పవర్‌ హౌస్‌ లో ప్రమాదం
X

శ్రీశైలం పవర్‌ హౌస్‌ కు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ పవర్‌ హౌస్‌ లోని ఏడో యూనిట్‌ లో బుధవారం ఉదయం స్పార్క్స్‌ వచ్చింది. వెంటనే పవర్‌ జనరేషన్‌ ఆగిపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇంజనీర్లు వెంటనే లోపాన్ని గుర్తించారు. పవర్‌ హౌస్‌ బయట చెట్ల కొమ్మలు ట్రాన్స్‌ మిషన్‌ లైన్లకు తగలడంతో ఏడో యూనిట్లో ప్రమాదం జరిగిందని ఏపీ జెన్‌ కో వర్గాలు చెప్తున్నాయి. వాటిని తొలగించి విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్దరించామని ఏపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్టుగా తెలిసింది. మూడేళ్ల క్రితం శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్‌ పవర్‌ స్టేషన్‌ లో పేలుడు సంభవించి పలువురు ఇంజనీర్లు, టెక్నీషియన్లు మృత్యువాతపడ్డారు. ఈ రోజు మళ్లీ పవర్‌ స్టేషన్‌ లో ప్రమాదం జరగడంతో ఇంజనీర్లు, సిబ్బంది హైరానా పడ్డారు. స్వల్ప ప్రమాదమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story