మార్కెట్‌లో లాభాల స్వీకరణ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం సరికొత్త గరిష్ఠాల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే అమ్మకాల్లో గరిష్ఠస్థాయిల్లో భారీగా ఒత్తిడి ఎదురుకావడంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి.

మార్కెట్‌లో లాభాల స్వీకరణ
X

అమ్మకాల్లో గరిష్ఠస్థాయిల్లో భారీగా ఒత్తిడి ఎదురుకావడంతో బుధవారం సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇటీవల కాలంలో ఇన్వెస్టర్లు మెటల్‌, ఐటీ, ఆటో షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడంతో భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల కోతలపై అనిశ్చితి పెరిగింది. దీంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి.

సెన్సెక్స్‌ 129.70 పాయింట్ల లాభంతో సరికొత్త జీవన కాల గరిష్ఠస్థాయి 80,481.36 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. భారీగా ప్రాఫిట్‌ బుకింగ్‌ జరగడంతో సూచీ ఒక దశలో 915.88 పాయింట్లు క్షిణించింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నపటికీ 79.924.77 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా సరికొత్త రికార్డు స్థాయి 24,461.05 వద్ద ట్రేడింగ్‌ ఆరంభించినప్పటికీ ఒకద శలో 291.4 పాయింట్లు పతనమై చివరికి 108,75 పాయింట్ల నష్టతో 24,324.45 వద్ద స్థిరపడింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 2 పైసలు తగ్గి 83.51 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.24 శాతం లాభంతో84.86 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

అమ్మకాల హోరులో బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 1.22 లక్షల కోట్లు తగ్గి రూ. 450.05 లక్షల కోట్లకు (5.39 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఉదయం సెషన్‌ సూచీల భారీ నష్టాల వల్ల మార్కెట్‌ క్యాప్‌ కూడా ఏడు లక్షల వరకు పతనమైంది.

Raju

Raju

Writer
    Next Story