రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌

కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలు చేశారు.

రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌
X

కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షి మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.

రాజ్యసభలో తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి 12 స్థానాలకు సెప్టెంబర్‌ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ చేరిన కే. కేశవరావు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ నుంచి తమ అభ్యర్థిగా అభిషేక్‌ను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21 వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉన్నది. అభిషేక్‌ ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి పోటీ చేసి బీజేపీ చేతిలో ఓడిపోయారు. అప్పుడు అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి అభ్యర్థికి ఓటు వేసిన సంగతి తెలిసిందే.

Raju

Raju

Writer
    Next Story