ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేత విజయ్ నాయర్‌కి బెయిల్

ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత, పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ విజయ్ నాయర్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Vijay nair
X

ఢిల్లీ మద్యం కేసులో ఆప్ నేత, పార్టీ మాజీ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ విజయ్ నాయర్‌కి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయ్ బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిగా ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్ధానం తాజాగా ఆయనకు బెయిల్ మంజురు చేసింది. విజయ్ నాయిర్ తరపున వాదనలు వినిపించారు తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి. జస్టిస్ ఎస్వీఎన్ బట్టి, జస్టిస్ హ్రిషికేష్ లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

లిక్కర్ కేసులో సుదీర్ఘంగా అండర్ ట్రయల్ ఖైదుగా ఉండడంతో విజయ్ నాయర్ బెయిల్ కి అర్హుడని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. కాగా సౌత్ గ్రూప్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత 100 కోట్లు విజయ్‌కి అందజేసినట్లు గతంలో దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story