వివాహ బంధంలోకి అడుగుపెట్టిన యువ క్రికెటర్

భార‌త యువ క్రికెట‌ర్ జితేశ్ శ‌ర్మ పెళ్లి చేసుకున్నాడు. టీ20 స్పెష‌లిస్ట్‌గా పేరొందిన జితేశ్ శుక్రవారం ఓ ఇంటివాడ‌య్యాడు.

Jithesh
X

టీమిండియా యువ క్రికెట‌ర్ జితేశ్ శ‌ర్మ‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వేద పండితుల ఆశీర్వ‌చ‌నాల మ‌ధ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన‌ ష‌ల‌క ముకేశ్వ‌ర్‌ను జితేశ్ పెళ్లి చేసుకున్నాడు. ఈ యువ మ్యారేజ్ వేడుక కుటుంభ‌స‌భ్యుల స‌మ‌క్షంలోసంప్ర‌దాయంగా, వైభ‌వంగా జ‌రిగింది. త‌మ పెండ్లి వేడుక ఫొటోల‌ను జితేశ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు. ‘ఈ క్రేజీ ప్ర‌పంచంలో 8.8.8న‌ మ‌నం ఒక‌రికొక‌రం దొరికాం’ అంటూ ఆ ఫొటోల‌కు జితేశ్ క్యాప్ష‌న్ రాశాడు. ఇంకేముంది క్ష‌ణాల్లో ఈ నూత‌న వ‌ధూవ‌రుల ఫొటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

భార‌త టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్, ఆల్‌రౌండ్ శివం దూబేలతో పాటు ప‌లువురు ఐపీఎల్ ఆట‌గాళ్లు జితేశ్ దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వ‌చ్చిన ఈ యువ బ్యాట‌ర్‌, వికెట్ కీప‌ర్ భార‌త్ త‌ర‌ఫున‌ ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది టీ20లు ఆడాడు. తాజాగా జింబాబ్వేతో జ‌రిగిన టీ20 సిరీస్‌లోనూ జితేశ్ రాణించాడు, పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున ఐపీఎల్ అద్భుతంగా ఆడాడు. ష‌ల‌క ఎల‌క్ట్రానిక్స్, టెలీక‌మ్యూనికేష‌న్స్ ఇంజ‌నీరింగ్ చ‌దివింది. అనంత‌రం ఎంటెక్ పూర్తి చేసిన ఆమె మ‌హారాష్ట్రలో సీనియ‌ర్ టెస్ట్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తోంది.

Vamshi

Vamshi

Writer
    Next Story