న్యూయార్క్‌లో సీఎం రేవంత్‌ బృందానికి ఘనస్వాగతం

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాకు చేరుకున్నారు.

న్యూయార్క్‌లో సీఎం రేవంత్‌ బృందానికి ఘనస్వాగతం
X

రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. న్యూయార్క్‌లో రేవంత్‌ బృందానికి అక్కడి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం లభించింది. న్యూయార్క్‌లో ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నట్లు సమాచారం.

11 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణకొరియాలోని సియోల్‌ను సీఎం బృందం సందర్శించనున్నది. 8 రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణకొరియాలో వీరు పర్యటిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. ఈ నెల 14 వరక ఈ పర్యటన కొనసాగనున్నది. ఇవాళ మంత్రి శ్రీధర్‌బాబు, రేపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరి రేవంత్‌ బృందంతో కలుస్తారు.

Raju

Raju

Writer
    Next Story