భావితరాలకు సర్వాయి పాపన్న జీవితం ఆదర్శం : డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని నివాళులర్పించారు.

భావితరాలకు సర్వాయి పాపన్న జీవితం ఆదర్శం : డిప్యూటీ సీఎం భట్టి
X

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొని నివాళులర్పించారు. చిత్తశుద్ది, సంకల్పం ఉంటే రాజ్యాధికారం సాధించువోచ్చు అని పాపన్న నిరూపించారని భట్టి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆయన జీవితం స్పూర్తిదాయకం ఆయన పుట్టిన ఊరు అభివృద్ధి కోసం పర్యటక శాఖ నుంచి రూ.4 కోట్ల 70 లక్షలను మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. తెలంగాణ లో బడుగు బలహీనవర్గాలకు ఆలోచింప చేసే దినం..

ఆనాడు రాజ్యాధికారం కోసం వారి పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొన్నరని పొన్నం పేర్కొన్నారు. గోల్కొండ కోట జయించిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శం. అందరూ ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలన్నరు. బడుగు బలహీనవర్గాల ఐక్యత కోసం ఆనాడు సైన్యం తో పోరాటం చేసే పరిస్థితి.. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం,ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలి. వారు అందరికీ ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మార్గదర్శకత్వం తీసుకోవాలి అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story