గురుకుల హాస్టల్లో బీర్లు తాగుతున్న మహిళా ప్రిన్సిపాల్...ఘూటుగా స్పందించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్

సూర్యాపేట గురుకుల మహిళా హాస్టల్‌ ఘటనపై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

RSP
X

సూర్యాపేట మండలం బాలెంల ప్రభుత్వ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ శైల‌జ‌, హాస్టల్ టేకర్ కలిసి బీర్లు తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుందని విద్యార్థినులు ఆరోపించారు. ప్రిన్సిపాల్ గదిలోని బీరువాలో మద్యం బాటిళ్లను మీడియాకు చూపించారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయ‌కుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇవాళ గురుకులాల్లో బీర్లు ప్ర‌త్య‌క్షం కావ‌డం ఆందోళ‌న క‌లిగించే విష‌యం అన్నారు. పుస్త‌కాలు ఉండాల్సిన చోట బీర్లు ప్ర‌త్య‌క్షం కావ‌డం అంటే ఆ ప్రిన్సిపాల్ ఎంత తెగించారో అర్థ‌మ‌వుతుంద‌న్నారు. దేవుడా.. ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయినయ్ మన సంక్షేమ గురుకులాలు…కాంగీయుల పాలనలో…! అని పేర్కొంటూ ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. అమ్మాయిల‌ని కూడా చూడ‌కుండా ప్రిన్సిపాల్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నార‌ని పేర్కొన్నారు.

త‌మ త‌ల్లిదండ్రులు వ‌చ్చినా కూడా వారితో కూడా ప్రిన్సిపాల్ బూతులు మాట్లాడి మాన‌సిక వేధింపుల‌కు గురి చేశార‌న్నారు. కొద్ది రోజుల క్రితం శైలజ కుమారుడు హాస్ట‌ల్‌కు వ‌చ్చి వారం రోజుల పాటు ఉన్నాడ‌ని, అమ్మాయిల హాస్ట‌ల్‌లో అత‌నికి ఏం ప‌ని అని విద్యార్థినులు ప్ర‌శ్నించారు. ఆ స‌మ‌యంలో తాము ఇబ్బందిగా ఫీల‌య్యామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏసీటీ మేడం అండ‌తోనే ప్రిన్సిపాల్ శైల‌జ అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ, త‌మ‌పై దౌర్జ‌న్యం చేస్తున్నార‌ని విద్యార్థినులు వాపోయారు. తాగిన మ‌త్తులో త‌మ‌ను ఏం చేస్తారోన‌ని భ‌యంగా ఉంద‌ని విద్యార్థినులు పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనతోమహిళా డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఉన్నతాధికారులు వెంటనే ప్రిన్సిపాల్, కేర్ టేకర్‌ను విధుల నుంచి తొలగించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. త‌క్ష‌ణ‌మే ప్రిన్సిపాల్ శైలజ‌తో పాటు ఏసీటీ మేడంను విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని విద్యార్థినులు డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story