బిత్తరి సత్తిపై కేసు నమోదు
నటుడు బిత్తరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది
- By VamshiLoading...
- | 7 Aug 2024 10:56 AM GMT
X
X
బుల్లి తెర నటుడు బిత్తరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. భగవద్గీతను కించపరచేలా వీడియో చేశాడని రాష్ట్రీయ వానరసేన ఆరోపిస్తూ తాజాగా ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిల్లుగీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా ఒక షాట్ వీడియో చేశాడు.
వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా సత్తి ఆ షాట్ వీడియో చేశాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్వుతుంది. దీంతో ఈ షాట్ వీడియోపై హిందూ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
Vamshi
Writer
Next Story