రామగుండంలో 800 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌: భట్టి

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

రామగుండంలో 800 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌: భట్టి
X

రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కూడా చర్చించామన్నారు.రామగుండంలో బి పవర్‌ హౌస్‌ను డిప్యూటీ సీఎం సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... కొద్దిరోజుల్లోపనే పవర్‌ ప్రాజెక్టుపై సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి-జెన్‌కో సంయుక్తంగా పవర్‌ ప్రాజెక్టును ప్రారంభించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందరి కోరిక మేరకు బి పవర్‌ హౌస్‌ పవర్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు.

అతి త్వరలోనే పవర్‌ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామన్నారు. భూసేకరణపై ప్రతిపాదనలు త్వరగా పంపించాలని అధికారులను కోరామన్నారు. యాభై ఏళ్లుగా ఈప్రాంతం వెలుగునిచ్చింది. సాగునీటిని కూడా తీసుకు వచ్చింది. ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు, ఎంపీలు పవర్‌ ప్రాజెక్టు విస్తరించాలని నా దృష్టికి తీసుకొచ్చారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇక్కడ నెలకొల్పిన జెన్‌కో విద్యుత్‌ కర్మాగారం జీవితకాలం పూర్తయ్యింది. జెన్‌కో ప్లాంట్‌తో ఇక్కడి ప్రజలకు విడదీయలేని అనుబంధం ఉన్నది. సింగరేణి కార్మికులకు రూ. కోటి రూపాయల బీమా సౌకర్యం కల్పించాని భట్టి చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రతి నియోజకవర్గ పరిధిలో స్కిల్‌ డెవలప్‌మెం్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పత్తిపాక రిజర్వాయర్‌ కోసం బడ్జెట్‌ కేటాయించామని తెలిపిన డిప్యూటీ సీఎం ఎల్లంపల్లి భూనిర్వాసితుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

మాంచెస్టర్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన రామగుండంలో1300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. ప్రాజెక్టుల స్థలాలను ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌ బాబు పరిశీలించారు. జెన్‌కో థర్మల్‌-బి పవర్‌ స్టేషన్‌ స్థానంలో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రులు స్థల పరిశీలన చేశారు.

Raju

Raju

Writer
    Next Story