బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి త్వరలో 5జీ సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం సంస్థ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది సంక్రాంతి వరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు

BSNL
X

బీఎస్‌ఎన్‌ఎల్ టెలికాం సంస్థ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. వచ్చే ఏడాది సంక్రాంతి వరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ ప్రిన్సిపాల్ జనరల్ మేనేజర్ శ్రీను తెలిపారు. అతి త్వరలో 5జీ సేవలకు గాను టవర్లు, హై టెక్నాలజీ పరికరాలను రీప్లేస్ చేసేందుకు దృష్టి పెట్టామని అన్నారు. వినియోదరలకు ఎలాంటి భారం లేకుండా 4జీ నుంచి 5జీ ప్లాన్ మారడానికి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. టెలికాం దిగ్గజలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) వంటి ప్రధాన టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ ప్లాన్ ధరలను గణనీయంగా పెంచాయి. దాదాపు 15 శాతం మేర పెంచడంతో మొబైల్ వినియోగదారులు సరసమైన ఆఫర్లకోసం బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు.

దీంతో మార్కెట్‌లో పరిస్థితులను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా 4జీ నెట్‌వర్క్ పరిధిని విస్తరించడంపై కంపెనీ దృష్టి పెట్టింది. ఇక త్వరలోనే 5జీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడంపై కంపెనీ దృష్టిసారించింది. బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు మార్కెట్‌లో అందుబాటులోకి వస్తే కస్టమర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డేటా స్పీడ్, కనెక్టివిటీ బాగుంటే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థ కావడంతో ఆఫర్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Vamshi

Vamshi

Writer
    Next Story