వయనాడ్‌ ఘటన..123కి చేరిన మృతులు

ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలతో.. శిథిలాల కింద చిక్కుకున్న ప్రజల ఆర్తనాదాలతో వయనాడ్ తల్లడిల్లుతోంది.

waned
X

వయనాడ్ ఘటనపై కేరళ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. మంగళవారం, బుధవారం సంతాప దినాలు పాటించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీగా కొండచరియలు విరిగిపడ్డిన ఘటనలో ఇప్పటి వరుకు 123 మరణించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.రంగంలోకి దిగిన కేరళ విపత్తు నిర్వహణ దళం, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు, ఆర్మీ చూరల్‌ మాలాలో సహాయక చర్యలు చేపడుతున్నాయి.

మరోవైపు కొండచరియలు విరిగిపడిన వయనాద్‌లోని చూరల్‌ మాల ప్రాంతంలో ఐఏఎఫ్‌ హెలికాఫ్టర్లు రంగంలోకి దిగడంతో రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతమైంది. శిధిలాల కింద చిక్కుకుపోయిన బాధితులను గుర్తించేందుకు శ్రమిస్తున్నారు. అరేబియా సముద్ర తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాల ధోరణిని శాస్త్రవేత్తలు ముందుగానే గుర్తించారని అభిలాష్ తెలిపారు. ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కుతుందని, దీంతో కేరళ సహా ఈ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరమైందిగా మారినట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. ఇలా వాతావరణంలో అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడటానికి కారణమన్నారు. ఈ రకమైన వర్షపాతం గతంలో ఉత్తర కొంకణ్‌ ప్రాంతంలో సాధారణంగా కనిపించేదన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story