ఏ క్షణమైనా ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాడి

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియా హత్యకు ప్రతీకారంగా ఏ క్షణమైనా ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉన్నది.

ఏ క్షణమైనా ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాడి
X

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియా హత్యకు ప్రతీకారంగా ఏ క్షణమైనా ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉన్నది. 48 గంటల్లో ఇది జరగవచ్చని అమెరికా, ఇజ్రాయిల్‌, జీ7 దేశాలు అంచనా వేస్తున్నాయి. దాడిని ధీటుగా ఎదుర్కొవడానికి ఇజ్రాయిల్‌, దాని మిత్ర పక్షం అమెరికా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అమెరికా ఇప్పటికే పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపింది. ఇజ్రాయిల్‌తో కలిసి సైనిక వ్యూహా రచన చేస్తున్నది. ఇరు దేశాల అగ్రశ్రేణి కమాండర్‌లు సోమవారం టెల్‌అవీవ్‌లో సమావేశమై చర్చలు జరిపారు. మరోవైపు ఇరాన్‌ ఇప్పటికే పొరగు దేశాలకు దాడి చేసే సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దాడిపై స్పష్టమైన సమాచారం అందితే అవసరమైతే తానే ముందుగా ఇరాన్‌పై దాడి చేయడానికి ఇజ్రాయిల్‌ సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది.

అటు తాజా పరిస్థితులపై జీ7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని నేతలను కోరారు. ఇజ్రాయిల్‌పై ఇరాన్‌, హెజ్‌బుల్లా ఏ క్షణమైనా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉన్నదని నేతలకు వివరించారు. అయితే దాడులు ఎప్పుడు జరుగుతాయన్నది కచ్చితంగా తెలియదన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను వీలనైంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉన్నదని బ్లింకెన్‌ తెలిపారు. ఉద్రిక్తతల పెరుగుదల ఎవరికీ మంచిది కాదని, అది మంరిత సంఘర్షణకు దారి తీస్తుందన్నారు. దాంతో విధ్వంసం జరుగుతుంది. అభద్రతాభావం పెరుగుతుందన్నారు. ఈ విషయంపై మిగిలిన దేశాలు దౌత్య మార్గాల్లో ఇరాన్‌కు నచ్చజెప్పాలని బ్లింకెన్‌ కోరారు.

పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం: బైడెన్‌

మధ్య ప్రాశ్చంలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు అమెరికా అద్యక్షుడు బైడెన్‌ తెలిపారు. ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌, తాను కలిసి పరిస్థితిని చర్చించినట్లు వెల్లడించారు. ఇరాన్‌, దాని ప్రాక్సీల నుంచి వచ్చే బెదిరింపుల తాజా సమాచారం తెలిసింది. ఉద్రిక్తలు తగ్గించడానికి దౌత్య ప్రయత్నాలు, ఇజ్రాయిల్‌ పై దాడి జరిగితే మద్దతుగా నిలువడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. మా బలగాలకు రక్షణ కల్పించే అంశంపై చర్చించినట్లు బైడెన్‌ తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story