ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం

కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి ఆహ్వానించిన పాకిస్థాన్

ప్రధాని మోదీకి పాక్ ఆహ్వానం
X

భారత ప్రధాని నరేంద్రమోదీకి దయాది దేశం పాకిస్థాన్ ఆహ్వానం పలికింది. అక్టోబర్ లో ఇస్లామాబాద్ లో నిర్వహించే కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సీహెచ్ జీ) సమావేశానికి రావాలని ఆహ్వానించింది. నిరుడు ఉజ్బెకిస్థాన్ లోని సమర్కండ్ లో షాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (సీఎస్ వో) సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇస్లామాబాద్ లో నిర్వహించే సీహెచ్జీ సమావేశానికి పాక్ ఎస్సీవో నేతలను కూడా ఆహ్వానించింది. పాకిస్థాన్ తో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశానికి భారత ప్రధాని హాజరుకాకపోవచ్చని భారత విదేశాంగ శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రధాన మంత్రి ప్రతినిధిగా ఈ సమావేశానికి విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హాజరయ్యే అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. గతేడాది బిష్కెక్ లో నిర్వహించిన సీహెచ్ జీ సమావేశానికి ప్రధాన మంత్రి తరపున జైశంకర్ హాజరయ్యారు. 2015 డిసెంబర్ 25న ప్రధాని నరేంద్రమోదీ ఆకస్మికంగా పాకిస్థాన్ లో పర్యటించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత మోదీ ఎప్పుడూ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేదు.

Next Story