నేడే ఇండియ-పాక్ మ్యాచ్.. జోరుమీదున్న టీమ్‌ఇండియా

ind-pak
X

టీ20 ప్రపంచకప్ 2024లో అసలు సిసలు సమరానికి సిద్దమైంది. చిరకాల ప్రత్యర్థుల భారత్, పాకిస్థాన్ మధ్య నేడు(ఆదివారం) జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. గ్రూప్- ఏలో భాగంగా జరిగే ఈ బిగ్ మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తోంది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌పై ఘనమైన రికార్డును కొనసాగించేందుకు భారత్‌ తహతహలాడుతున్నది. ఐర్లాండ్‌పై ఘన విజయంతో టీమ్‌ఇండియా మంచి జోరుమీదుంటే..ఆతిథ్య అమెరికా చేతిలో అనూహ్య ఓటమితో పాక్‌ ఒత్తిడి ఎదుర్కొంటున్నది.

మెగాటోర్నీలో కీలక మ్యాచ్‌గా భావిస్తున్న భారత్‌, పాక్‌ పోరులో పైచేయి ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై సునాయస విజయం అందుకున్న టీమిండియా ఉత్సాహంగా కనిపిస్తుండగా.. పసికూన అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ కల్పించాలనే ఉద్దేశంతో ఐసీసీ ఈ మ్యాచ్‌కు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించింది. అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని అందుకున్న పాక్ తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఆ జట్టు ఓటమి కంటే ఆటతీరే అభిమానులను కలవరపెడుతోంది. బ్యాటింగ్ విభాగం చాలా బలహీనంగా ఉంది. బౌలర్లు షాహిన్ అఫ్రిది, రౌఫ్, నసీమ్ షా మునపటిలా సత్తా చాటలేకపోతున్నారు. 2021 ప్రపంచకప్‌లో మినహా ప్రతీసారి భారత్‌ చేతిలో భంగపడిన టీమ్ ఈ సారి ఏం చేస్తుందనేది చూడాలి.


తుది జట్లు(అంచనా)

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్/ కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్: మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్(కెప్టెన్), ఉస్మాన్, ఫకర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహిన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్, మహమ్మద్ అమీర్, నసీం షా.

Vamshi

Vamshi

Writer
    Next Story