నేడు సినిమా షూటింగ్‌లు బంద్

రామోజీరావు మృతికి సంతాపంగా నేడు చిత్ర పరిశ్రమ బంద్

Movie shooting
X

రామోజీరావు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సంతాపం వ్యక్తం చేసింది. సంతాప సూచికగా నేడు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటలకు నుండి 10 గంటల మధ్య తెలంగాణ సర్కార్ అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పార్థిదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఉషాకిరణ్ మూవీస్‌తో సినీ పరిశ్రమపైన రామోజీరావు తనదైన ముద్ర వేశారు. తెలుగు, కన్నడ, హింది సహా పలు భాషల్లో 80కిపైగా ఫీల్ గుడ్ సినిమాలను నిర్మించారు. ఎందరో హీరోలను, దర్శకులు, సంగీత దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

కీరవాణి, శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, తరుణ్, డైరెక్టర్ తేజ, జేనీలియా, శ్రియా మొదలైన ప్రముఖులు అలా వచ్చిన వారే. రామోజీరావు మూవీస్‌లో నువ్వేకావాలికి జాతీయ అవార్డు రాగా మరి కొన్ని సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. "నిన్ను చూడాలని" అనే సినిమాతో తారక్‌ను రామోజీ రావు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు.1984లో శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో నిర్మాతగా మారిన రామోజీరావు అనేక చిత్రాలను నిర్మించి సక్సెస్ అయ్యారు. వాటిలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నుంచి సమాజానికి ఉపయోగపడే సామాజిక సినిమాలు ఉన్నాయి. మెకానికి మామయ్య వంటి కమర్షియల్ హిట్ సినిమాలు సైతం ఉన్నాయి. అలాగే పీపుల్స్ ఎన్‌కౌంటర్ వంటి విప్లవాత్మక సినిమాలు, మౌన పోరాటం, ప్రతిఘటన, మయూరి వంటి లేడి ఒరియెంటెడ్ చిత్రాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story