12 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారు? : సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచరణ ఘటపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

12 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారు? : సుప్రీంకోర్టు
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా జూనియర్‌ డాక్టర్‌ హత్యాచరణ ఘటపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ట్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది.ఈ సందర్భంగా దారుణం చోటు చేసుకున్న ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

మహిళలు, యువ వైద్యులు భద్రతపై అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన భయానకం అని పేర్కొన్నది. ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్‌ ప్రిన్సిపల్‌ ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారు? అతని ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? అని ప్రశ్నించారు. మృతదేహాన్ని అప్పగించిన మూడు గంటల తర్వాత 12 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేశారు? ప్రిన్పిపాల్‌ ఏం చేస్తున్నారు? అని సుప్రీంకోర్టు నిలదీసింది. అప్పటివరకు హాస్పిటల్‌ అధకారులు, కోల్‌కతా పోలీసులు ఏం చేస్తున్నారు? కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించడంపైనా మండిపడింది. దీనిపై గురువారం లోగా దర్యాప్తు స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది.

మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే చోట భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లే. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలకు ఏకధాటిగా పనిచేస్తున్నారు. వారికి పనిచేసే చోట భద్రత అవసరమని ఇందుకోసం సుప్రీం జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేసింది. ఇందులో హైదరాబాద్ కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ ఎండీ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే శరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపింది.

Raju

Raju

Writer
    Next Story