నీళ్ల ట్యాంకుతో మొదలైన గొడవ.. హత్య దాకా

నగరంలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్‌ ఖాజా రియా జుద్దీన్‌ కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు.

నీళ్ల ట్యాంకుతో మొదలైన గొడవ.. హత్య దాకా
X

హైదరాబాద్ లో ఈ నెల 8వ తేదీన రౌడీషీటర్‌ ఖాజా రియా జుద్దీన్‌ కళ్లలో కారం కొట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపి, తలపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసును ఛేదించారు. రాచకొండ సీపీ సుధీర్‌బాబు మహేశర్వరం డీసీపీ సునీతారెడ్డి, ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌ వివరాల వెల్లడించారు. వారి వివరాల ప్రకారం రౌడీ షీటర్‌ రియాజుద్దీన్‌పై పహాడీ షరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆరు కేసులున్నాయి. రిజాజ్‌కు అదే ప్రాంతానికి చెందిన షేక్‌ మహ్మద్‌ హమీద్‌ కుటుంబంతో విభేదాలున్నాయి. వీరిద్దరి మధ్య అప్పటికే ఓ భూ వివాదం నడుస్తున్నది. ఆ స్థలంలో హమీద్‌ నీళ్ల ప్లాంట్‌ ఏర్పాటు చేశాడు. తమ స్థంలో ఎలా ఏర్పాటు చేస్తారని రియాజుద్దీన్‌ ప్రతిఘటించాడు. ఈ గొడవలతో పాటు ఇరు కుటుంబాల మధ్య ప్రతీకారం కూడా పెరిగింది.

నీటి ప్లాంట్లు ఏర్పాటుతో మొదలైన కక్షతో ప్రత్యర్థులు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించారు. రియాజ్‌ను తుపాకీతో కాలిస్తే పెద్ద రౌడీలమైపోతామని నిందితులు పేర్కొన్నారు. ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసినట్టు, వారి నుంచి దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు, గొడ్డళ్లు, కొబ్బరిబొండాల కత్తి, కారం డబ్బా, కారు, రూ. 4 లక్షలు, ఆరు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Raju

Raju

Writer
    Next Story