టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్

లే బోర్గట్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్న పోలీసులు

టెలిగ్రామ్ సీఈవో అరెస్ట్
X

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ టెలిగ్రామ్ ఫౌండర్ సీఈవో పావెల్ దురోవ్​ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లే బోర్గట్ ఎయిర్ పోర్టులో పారిస్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చీటింగ్, డ్రగ్స్ ఇల్లీగల్ ట్రాన్స్ పోర్టేషన్, సైబర్ క్రైం సహా పలు నేరాలను ప్రోత్సహించారని దురోవ్​ పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన అరెస్టుకు గతంలోనే వారెంట్ జారీ చేశారు. అజర్ బైజాన్ నుంచి ఆయన పారిస్ లో అడుగు పెట్టగానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారమే ఆయనను కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

Next Story