పూజా ఖేడ్కర్‌ ట్రైనింగ్‌ నిలిపివేత

పూజా ఖేడ్కర్‌ ట్రైనింగ్‌ నిలిపివేత
X

మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రయినీ ఐఏఎస్‌ అధికారాణి పూజా ఖేడ్కర్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకున్నది. అడ్డదారుల్లో ఐఏఎస్‌ అయ్యారని పూజ ఖేడ్కర్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమె శిక్షణను నిలిపివేస్తూ తిరిగి ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రీ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కు ఉత్తర్వులు జారీ చేపినట్టు తెలుస్తోంది.

అధికార దుర్వినియోగం, యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడం వంటి ఆరోపణలతో వార్తల్లో నిలిచిన పూజాను మహారాష్ట్ర జిల్లా శిక్షణా కార్యక్రమం నుంచి రిలీవ్‌ చేస్తున్నట్టు జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

మరోవైపు పూజా ఖేడ్కర్‌ సమర్పించిన మెడికల్‌ సర్టిఫికెట్ల ప్రామాణికతపై పోలీస్‌ విచారణ జరగనున్నది. ఈ మేరకు దివ్యాంగుల కమిషనర్‌ పోలీసుల కమిషనర్‌తో పాటు జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు.నకిలీ పత్రాలతో దివ్యాంగుల కోటాలో పదవి పొందినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం వాసిం జిల్లాలో పోస్టింగ్‌ పొందిన పూజా ఖేడ్కర్‌ యూపీఎస్సీకి సమర్పించిన పలు ధృవపత్రాల్లో అంధత్వానికి సంబంధించిన సర్టిఫికెట్‌ కూడా ఉన్నది. సివిల్‌ సర్వీస్‌ పాస్‌ కావడానికి ఆమె నకిలి దివ్యాంగురాలి సర్టిఫికెట్‌తో పాటు ఓబీసీ కోటా వాడుకున్నారని, పోస్టింగ్‌ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

Raju

Raju

Writer
    Next Story