పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట

ఐఏఎస్‌ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆగస్టు 21 వరకు ఆమెను అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట
X

ఐఏఎస్‌ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదని, ఆగస్టు 21 వరకు ఆమెను అరెస్టు చేయవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.నకిలీ పత్రాలు సమర్పించి ఐపీఎస్‌ ఉద్యోగం పొందారని పూజాపై అభియోగాలున్నాయి. దీంతో ఆమె ఐపీఎస్‌ ఎంపికను రద్దు చేస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకున్నది.

ఫుణెలో ట్రైనీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమమంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్‌ పత్రాలు సమర్పించారనే ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. అలాగే నకిలీ పత్రాలతో పరీక్ష ను క్లియర్‌ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఈకేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి ఇదివరకే ఢిల్లీ కోర్టు నిరాకరించింది. తనకు ముందస్తు బెయిల్ నిరాకరించిన జిల్లా కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పూజా ఖేడ్కర్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెను కస్టోడియల్‌ విచారణకు అనుమతించాలని కోరుతూ యూపీఎస్సీ తరఫు న్యాయవాది నరేశ్‌ వాదించగా.. ఖేడ్కర్‌ తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు.

Raju

Raju

Writer
    Next Story