ఓటుకు నోటు కేసు: బదిలీ పిటిషన్‌పై విచారణ మరో రెండు వారాలు వాయిదా

గత శుక్రవారం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయవ్యవస్థకు రేవంత్‌ క్షమాపణలు చెప్పారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వెల్లడి

ఓటుకు నోటు కేసు: బదిలీ పిటిషన్‌పై విచారణ మరో రెండు వారాలు వాయిదా
X

ఓటుకు నోటు కేసు విచారణ బదిలీ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు వాయిదా వేసింది. న్యాయవాదులు, న్యాయమూర్తులపై సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేసిందని ఇంటర్‌ లోకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు జగదీశ్‌రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడిగా పోలీసు అధికారులను బెదిరించేలా వ్యవహరించారని, ప్రస్తుతం హోం మంత్రి హోదా కూడా సీఎం వద్దనే ఉన్నదని న్యాయవాదులు మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం ఒకవేళ మరోచోటుకు మార్చితే కూడా అధికారులు ఆయన చెప్పిన తర్వాతే కోర్టు వెళతారు కదా అని ప్రశ్నించింది. విచారించే కోర్టు మారినా.. పరిధి మారదు, విషయం మారదని న్యాయమూర్తులు తెలిపారు.

ఇప్పటికే 25 మంది సాక్షుల నుంచి అన్ని వివరాలు నమోదయ్యాయని తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. గత శుక్రవారం కోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఈ వ్యవహారంలో రేవంత్‌రెడ్డికి పూర్తి బాధ్యత ఉంటుందని న్యాయవాదులు తెలిపారు.

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విశ్వనాథన్‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'ముఖ్యమంత్రి ప్రకటనలను ఈరోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన సీఎం చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి? మేం రాజకీయపార్టీలను సంప్రదించో, లేక రాజకీయాంశాల ఆధారంగానో ఉత్తర్వులిస్తామా? ఓటుకు నోటు కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అదే ప్రాతిపదిక అవుతుంది. మేం రాజకీయ పార్టీల గురించి, మా ఉత్తర్వులపై చేసే విమర్శల గురించి పట్టించుకోం. ఆత్మప్రబోధానుసారం, చేసిన ప్రమాణం ప్రకారం విధులు నిర్వర్తిస్తాం. అయితే కొందరు వ్యక్తల దృక్పథం వారి తెంపరి తనాన్ని ప్రతిబింబిస్తోంది. 'అని వ్యాఖ్యానించింది

అయితే తాను చేసిన వ్యాఖ్యలే ఓటు నోటు కేసు విచారణ ఓటుకు నోటు కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అదే ప్రాతిపదిక అవుతుందన్న సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడంతో సీఎం తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు.'భారత న్యాయవ్యవస్థపై తనకు గౌరవం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. 'ఆగస్టు 29న కొన్ని మీడియా వేదికల్లో నేను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు .. కోర్టులను ప్రశ్నిస్తున్నాననే అర్థంలో ధ్వనించాయి. నేను చేసిన వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా కథనాలు వచ్చాయి. బెయిల్‌పై సుప్రీంకోర్టు తీర్పును ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదోవ పట్టించారని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నాను. న్యాయ వ్యవస్థ, దాని స్వతంత్రత పట్ల నాకు అపార గౌరవం, విశ్వాసం ఉన్నాయి. రాజ్యాంగం, దాని విలువలను విశ్వసించే నేను... ఎన్నటికీ న్యాయవ్యవస్థను అత్యున్నతమైనది భావిస్తూనే ఉంటానని' రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story