గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతి

గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా షాపూర్‌లో చోటు చేసుకున్నది.

గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతి
X

గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా షాపూర్‌లో చోటు చేసుకున్నది. మరికొంత మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలిలో శిథిలాలను పూర్తిగా తొలిగించారు. పాత ఇంటి గోడ కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

అక్కడి ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం.. షాపూర్‌లోని హర్దౌల్ ఆలయంలో శివలింగ నిర్మాణం, భగవత్ కథను నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసంలో, ప్రజలు ఉదయం నుంచి ఇక్కడ శివలింగాన్ని తయారు చేయడం ప్రారంభిస్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో శివలింగాన్ని తయారు చేయడానికి చిన్నారులు కూడా భారీగా తరలివచ్చారు. చిన్నారులు కూర్చుని శివలింగాన్ని తయారు చేస్తున్న చోట ఆలయ ప్రాంగణంలోని పక్క గోడ కూలిపోయింది. రెస్క్యూ టీమ్‌ అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోపాల్ భార్గవ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఘటనపై మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించారు.

Raju

Raju

Writer
    Next Story