డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిపై నార్కోటిక్‌ పోలీసులు నిఘా

మాదకద్రవ్యాలు తీసుకుంటున్న వారిపై నార్కోటిక్‌ పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా తెచ్చిన డ్రగ్స్‌ డిటెక్టివ్‌ పరికరాలతో 40 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిపై నార్కోటిక్‌ పోలీసులు నిఘా
X

మాదకద్రవ్యాలు తీసుకుంటున్న వారిపై నార్కోటిక్‌ పోలీసులు నిఘా పెట్టారు. తాజాగా తెచ్చిన డ్రగ్స్‌ డిటెక్టివ్‌ పరికరాలతో 40 మంది అనుమానితులకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వారిద్దరినీ మాదాపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి రక్త నమూనాలను సేకరించారు.

నగరంలో డ్రగ్స్‌ రవాణా పెరిగిపోయిందని ఇటీవల నమోదవుతున్న కేసుల బట్టే తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుల్లో యువతీ, యువకులతో పాటు కొంతమంది టీవీ, సినిమా నటీనటులు పట్టుబడుతుండటం కలకలం సృష్టిస్తున్నది. డ్రగ్స్‌ కట్టడికి పటిష్ట చర్యలు చేపడుతామని, డ్రగ్స్‌ విక్రయించే వారిపై, వినియోగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. అయినా డ్రగ్స్‌, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నదనే ఆరోపణలున్నాయి.

నిన్ననే హైదరాబాద్‌లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 60 లక్షల విలువైన 164 గంజాయి స్వాధీనం చేసుకుని, 2 కేసుల్లో ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని దీనిపై నిఘా పెట్టామని పోలీస్‌ ఉన్నతాధికారులు చెప్పారు. ప్రభుత్వం నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలున్నాయని డ్రగ్స్‌ విక్రయించినా, తీసుకున్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్‌ తీసుకుంటున్న వారిపై నార్కోటిక్‌ పోలీసులు నిఘా పెట్టినట్టు సమాచారం.

Raju

Raju

Writer
    Next Story