ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు భుజంగరావుకు మధ్యంతర బెయిల్‌
X

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భుంజగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. గుండె సంబంధిత చికిత్స కోసం షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భుజంగరావు ఏ-2 ఉన్న విషయం విదితమే. ఈ కేసులో ఆయనను మార్చి 23న అరెస్టు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన దాదాపు ఐదు నెలల తర్వాత అదనపు ఎస్పీ ర్యాంక్ అధికారి ఎన్ భుజంగరావుకు వైద్య కారణాలతో 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఈ కేసులో ఆయనతోపాటు మరో ముగ్గురు తెలంగాణ సీనియర్ పోలీసులు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇంటెలిజెన్స్ వింగ్ అధికారి భుజంగరావు గత వైద్య చరిత్రను ఉదహరించారు. అతను చేయించుకున్న గుండె చికిత్సకు సంబంధించి తదుపరి చికిత్స అవసరమని పేర్కొన్నారు.

Raju

Raju

Writer
    Next Story