ప్రయాణికులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు..23 మంది మృతి

పాకిస్థాన్‌లో ప్రయాణికులే లక్ష్యంగా సాయుధ దాడి జరిగింది. రహదారిని అడ్డగించి, ప్రయాణికులను దించి ముష్కరులు దాడికి తెగబడ్డారు. బలూచిస్థాన్‌లోని ముసాఖెల్‌ జిల్లాలోని రరాషమ్‌లోని రోడ్డుపై ఈ ఘోరం జరిగింది.

ప్రయాణికులే లక్ష్యంగా విచక్షణారహితంగా కాల్పులు..23 మంది మృతి
X

పాకిస్థాన్‌ ముష్కరుల కాల్పుల్లో 23 మంది మృతి చెందారు. బలూచిస్థాన్‌-పంజాబ్‌ జాతీయ రహదారిపై వాహనాలను ఆపిన ముష్కరులు బస్సులు, ట్రక్కుల్లో వెళ్తున్నవారిని బలవంతంగా దించారు. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 23 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో మరో ఐదుగురికి గాయాలయ్యాయి. అంతేకాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు.

మృతుల్లో 19 మంది పాక్‌ పంజాబీలు, ముగ్గురు బలూచిస్థాన్‌ వాసులున్నారు. మృతుల్లో అధికంగా పాక్‌ పంజాబీ కూలీలు ఉన్నట్లు గుర్తించారు. ముష్కరులు-ప్రమాణికుల బృందంపై ఆరా తీసినట్లు పాక్‌ అధికారి వెల్లడించారు. బలూచిస్థాన్‌ సీఎం సర్ఫరాజ్‌ బుగ్టీ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Raju

Raju

Writer
    Next Story