ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌.. సీఐ, ఎస్సైపై వేటు

ముచ్చుమర్రి ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలపై వేటు వేసింది.

ముచ్చుమర్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌.. సీఐ, ఎస్సైపై వేటు
X

వారం రోజుల కిందట నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో దారుణం చోటుచేసుకున్నది. బాలికపై ముగ్గురు మైనర్లు లైంగిక దాడి చేసి చంపేసి హంద్రీనివా కేసీ కెనాల్‌లో పడేశారు. కూతురు కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకి కోసం వారం రోజులుగా కేసీఆర్‌ కెనాల్‌ ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినా బాలిక మృత దేహం దొరకలేదు. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు గట్టిగా విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విషయం బైటికి తెలుస్తుందని బాలిక మృత దేహాన్ని కేసీ కెనాల్‌ నుంచి తీసి పుట్టితో శ్రీశైలం రిజర్వాయర్‌ మధ్యవరకు తీసుకెళ్లి బండరాళ్లతో కట్టి పడేశామని విచారణలో చెప్పినట్టు ఎస్పీ అదిరాజ్‌ సింగ్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధుల పట్ల అలసత్వం ప్రదర్శించారని, క్రమశిక్షణ ఉల్లంఘించారని నందికొట్కూర్‌ రూరల్‌ సీఐ విజయ్‌ భాస్కర్‌, ముచ్చుమర్రి ఎస్సై జయశేఖర్‌పై కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు సస్పెన్షన్‌ వేటు వేశారు. విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Raju

Raju

Writer
    Next Story