కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్‌లో మంటలు

విశాఖ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మూడు ఏసీ బోగీల్లో మంటల్లో కాలిపోయాయి.

కోర్బా-విశాఖ ఎక్స్ ప్రెస్‌లో మంటలు
X

విశాఖ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. కోర్బా విశాఖ ఎక్స్‌ప్రెస్‌ మూడు ఏసీ బోగీల్లో మంటల్లో కాలిపోయాయి. మంటల ధాటికి రైలు బీ-6,బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అధికారులు ఊపిరి పిల్చుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే ఈ రైలు ఉదయం 7 గంటలకు కోర్బా నుంచి విశాఖపట్నానికి వచ్చింది. నాలుగో నెంబర్‌ ఫ్లాట్‌ ఫామ్‌పై ఆగిన ఈ రైలులో కోచ్‌లోని మొత్తం బోగీలను మెయింటెన్‌ చేసి, తిరిగి యార్గ్‌లోకి తీసుకెళ్తారు. మద్యాహ్నం 2 గంటలకు ఈ రైలు తిరుపతి బయలు దేరుతుంది. కోచ్‌ యార్డ్‌లోకి తీసుకెళ్లే సమయంలోనే బీ-7 కంపార్ట్‌మెంట్‌ లో మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసే లోగానే బీ-6, ఎం-1 బోగీలు కూడా మంటల్లో కాలిపోయాయి. దీంతో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఋ ఘటన ఎలా జరిగింది? విద్రోహ చర్యనా లేక విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల వల్ల జరిగిందా అన్నది విచారణలో తేలుతుందని ఉన్నతాధికారులు తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story