నీట్‌-యూజీ అక్రమాలపై సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

నీట్‌-యూజీ అక్రమాలపై సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్‌
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. నిందితులుగా 13 మంది పేర్లను చేర్చింది. నిందితులు పేపర్‌ లీకేజీ సహా అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపింది. సీబీఐ ఈ కేసులు ఇప్పటివరకు ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. వీటిలో ఒకటి బీహార్‌లో పేపర్‌ లీకేజీకి సంబంధించింది కాగా.. మిగతావి గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలలో జరిగిన ఇతర అవకతవకలపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. నీట్‌లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలనే కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది.

నీట్‌-యూజీ పరీక్షకు సంబంధించి జరుగుతున్న వివాదంపై భారత సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం తన వివరణాత్మక తీర్పును వెలువరించనున్నది. గ్రేస్ మార్కుల సమస్య నేపథ్యంలో మెడికల్ ప్రవేశ పరీక్షను తిరిగి నిర్వహించాలన్న అభ్యర్థనను జూలై 23న సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అందువల్ల నేడు దాని వెనుక ఉన్న కారణాలను వెల్లడించే అవకాశం ఉన్నది.

Raju

Raju

Writer
    Next Story