అలాంటి సినిమాలకు సెన్సార్‌ అవసరం లేదు: వివేక్‌ అగ్నిహోత్రి

సెన్సార్‌ వివాదంలో చిక్కుకున్న 'ఎమర్జెన్సీ'కి మద్దతుగా నిలిచిన బాలీవుడ్‌ డైరెక్టర్‌

అలాంటి సినిమాలకు సెన్సార్‌ అవసరం లేదు: వివేక్‌ అగ్నిహోత్రి
X

కంగనా రనౌత్‌ నటించిన 'ఎమర్జెన్సీ' మూవీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ మూవీ విడుదలపై వివాదం చాలారోజులుగా కొనసాగుతున్నది. సినిమాలో వాస్తవాలను వక్రీకరించారని సిక్కు సమాజానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. సెన్సార్‌ వివాదంలో చిక్కుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ కావాల్సింది. సెన్సార్‌ బోర్డు సినిమాకు సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడంతో విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్‌ డైరెక్టర్‌ వివేక్‌ అగ్రిహోత్రి సెన్సార్‌షిప్‌పై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆ పోస్టును కంగనా తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

'సృజనాత్మక వ్యక్తీకరణలను ఎప్పుడూ సెన్సార్‌ చేయకూడదు. ఇదినా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ మీరు అన్నింటిని సెన్సార్‌ చేయాలనుకుంటే.. టీవీ చర్చలు, వార్తా కార్యక్రమాలు, రాజకీయ, మతపరమైన ప్రసంగాలు ఇలాంటి వాటినీ సెన్సార్‌ చేయాలి. ఎందుకంటే ఇవి ద్వేషం, హింసలకు నిజమైన మూలాలు అని వివేక్‌ అభిప్రాయపడ్డారు. విమర్శలను ఎదుర్కొనే ధైర్యం లేకనే వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం మానేస్తున్నారు. మనోభావాలను దెబ్బతీసే విమర్శలను కూడా స్వీకరించి.. వాటిని మనం బలంగా మార్చుకోవాలి. పిరికి వాళ్లు తమకు అనుకూలంగా ఉన్నవాటికి మాత్రమే సెన్సార్‌ చేస్తున్నారు' అని వివేక్‌ అగ్నిహోత్రి రాసుకొచ్చారు. ఈ పోస్టును కంగనా తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' మూవీ పై వివాదం చెలరేగింది. కశ్మీర్‌ పండితుల నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే వివేక్‌ రూపొందించిన ది వ్యాక్సిన్‌ వార్‌ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌ను సైంటిస్టులు ఎలా అభివృద్ధి చేశారో ఆ సినిమాలో చూపెట్టారు.

Raju

Raju

Writer
    Next Story