- Home >
- Entertainment >
- Cinema
మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం కమిషన్ ఏర్పాటు చేయండి : మంచు విష్ణు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని "మా"అధ్యక్షుడు మంచు విష్ణు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని కోరుతు విష్ణు ట్వీట్ చేశారు.
- By VamshiLoading...
- | 5 Sept 2024 3:46 PM GMT
X
X
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళల భద్రత కోసం ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని "మా"అధ్యక్షుడు మంచు విష్ణు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టిని కోరుతు విష్ణు ట్వీట్ చేశారు. మహిళా నటీమణులు రక్షణ విషయంలో టాలీవుడ్లో ప్రతి ఒక్కరి నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామన్నారు.
కెమెరా ముందు వెనుక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో తాము దానికి ప్రాధాన్యత ఇస్తున్నామని విష్ణు పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి "మా" ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. తమిళ సినిమా పరిశ్రమలో మహిళా నటీమణులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కమిటీ వేసిన సంగతి తెలిసిందే
Vamshi
Writer
Next Story