- Home >
- Entertainment >
- Cinema
రూ. 700 కోట్ల క్లబ్లో కల్కి 2898 ఏడీ
కల్కి 2898 ఏడీ మూవీ మరో మైలురాయిని చేరుకున్నది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 700 కోట్ల వసూళ్లు సాధించినట్టు చిత్ర బృందం ప్రకటించింది.
- By RajuLoading...
- | 4 July 2024 4:20 AM GMT
X
మహాభారతం బ్యాక్ డ్రాప్‌గా సైన్స్, ఫిక్షన్ నేపథ్యంతో భారీ బడ్జెతో రూపొందిన కల్కి 2898 ఏడీ మూవీ కలెక్షన్లలో రికార్డులు సృష్టిస్తున్నది. జూన్ 27న విడుదలైన ఈ సినిమా 5 రోజుల్లో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టగా మరో మైలురాయిని చేరుకున్నది. ఇప్పటివరకు రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది. ఇందులో హీరో ప్రభాస్ లేకుండా దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్‌ను హైలెట్ చేసింది. ప్రభాస్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుండటం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భైరవగా ప్రభాస్, బిగ్ బీ అమితాబచ్చన్ అశ్వత్థామగా, మరో అగ్రనటుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్‌గా నటించిన ఈ సినిమా విజువల్ వండర్‌గా రూపొందింది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొణె లు తమ పాత్రలకు న్యాయం చేశారు. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను సినీ ప్రముఖులు ప్రశంసంల్లో ముంచెత్తుతున్నారు.