రిలీజ్‌కు ముందే ప్రభాస్ కల్కి మూవీ రికార్డు

డార్లింగ్ ప్రభాస్ కల్కి మూవీ కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. సినిమా సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా 42 షోలు ఏర్పాటు చేయడం విశేషం

kalki movie
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో నటించిన కల్కి 2898 ఏడీ మూవీ రేపు రిలీజ్ కానుంది. టికెట్లు అన్‌లైన్లో పెట్టి క్షణాల్లోనే అమ్ముడయ్యాయి. కల్కి సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు దేశమంతా ఎదురు చూస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్స్ రావడంతో అన్ని థియేటర్స్ లో టికెట్ ధరలు పెరిగాయి. ముంబైలో టికెట్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.

ఒక్కో టికెట్ రూ.2,300కి విక్రయిస్తోంది. మరికొన్ని థియేటర్లలో అభిమానులు రూ.17,60 నుండి రూ.15,60 పెట్టి మరి టికెట్లు కొంటున్నారు. బెనిఫిట్ షో ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు టికెట్‌ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ క్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ చిత్ర టికెట్‌పై సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.125 వరకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా ఈ సినిమా ఇంకా విడుద‌ల కాక ముందే రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇంత‌వ‌ర‌కు ఇండియాలో ఎలాంటి స్టార్ హీరోకు సాధ్యం కానీ విధంగా అమెరికాలో ప్రీమియ‌ర్స్‌ కు ల‌క్ష‌ల్లో టికెట్ల సేల్స్ జ‌రిగి స‌రికొత్త చ‌రిత్రను తిర‌గ‌రాసింది. ఈ మేర‌కు మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌ట‌న కూడా చేశారు. రిలీజ్‌కు ముందు, త‌ర్వాత ఫాస్టెస్ట్‌గా 3 మిలియన్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించిన తొలి భార‌తీయ చిత్రంగా క‌ల్కి రికార్డు నెల‌కొల్పింది.

Vamshi

Vamshi

Writer
    Next Story