పెళ్లి పీటలెక్కనున్న నాగచైతన్య, శోభిత

నటి శోభిత ధూళిపాళ్లతో హీరో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ ఇవాళ జరగనున్నది.

పెళ్లి పీటలెక్కనున్న నాగచైతన్య, శోభిత
X

నటి శోభిత ధూళిపాళ్లతో హీరో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్‌ ఇవాళ జరగనున్నది. ఇరు కుటుంబాల మధ్యే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు నాగ చైతన్య సన్నిత వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కొద్ది నెలల కిందట వీరిద్దరూ ఫారిన్‌ వెకేషన్‌లో కనిపించారు. అప్పటి నుంచే ఈ జంట రిలేషన్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.

2021లో నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. వాళ్లిద్దరు విడిపోయిన నాటి నుంచి శోభితతో చైతూ డేటింగ్‌ చేస్తున్నట్లు రూమర్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఎంగేజ్‌మెంట్‌ ఖరారు కావడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Raju

Raju

Writer
    Next Story