మ‌ల‌యాళ న‌టుడిపై లైంగిక‌ ఆరోపణలు..కీలక పదవికి నిర్మాత రాజీనామా

కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేశారు. మలయాళ చిత్రసీమలో మహిళల పని పరిస్థితులపై హేమ కమిటీ నివేదిక ఇవ్వడంతో నిర్మాత రాజీనామా చేశారు.

Malayam
X

కేరళ స్టేట్‌ మూవీ అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేశారు. బెంగాలీ నటి శ్రీలేఖ కీలక ఆరోపణలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిద్ధిఖీ ఆడిషన్‌ కోసం పిలిచి ఆయన తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. నటి వ్యాఖ్యలపై స్పందించిన రంజిత్‌.. ఆమెవి కేవలం ఆరోపణలు మాత్రమేనని అన్నారు. తన సినిమాలో అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి నిందలకు వేస్తున్నారని చెప్పారు. శ్రీలేఖ ఆరోపణలతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తాజాగా కేరళ చలచిత్ర అకాడమీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

2009లో ఓ మూవీ ఆడిషన్ కోసం తనను హోటల్ రూమ్‌కి.. ఆ సమయంలో ఆ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడుని ఆమె పేర్కొంది.పలేరి మాణిక్యం సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపింది. ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో రంజిత్ బాలకృష్ణన్ తన చేతి గాజులని తాకారని కూడా బెంగాలీ నటి శ్రీలేఖ పలు ఆరోపణలు చేసింది. ప్రస్తుతం మీరు చూస్తుంది ఆయన నిజస్వరూపం కాదు. ఆయనలోని మరో కోణాన్ని నేను చూశా. శారీరకంగా, మానసికంగా ఆయన నన్ను బాధించాడు.

నా దృష్టిలో ఆయనొక క్రిమినల్‌. ఈ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. దీనివల్ల నా కెరీర్‌ కూడా దెబ్బతింది. ఏ వ్యవస్థా నాకు సాయంగా నిలబడలేదు. ఈ విషయంపై మాట్లాడటానికి నాకు చాలా సమయం పట్టింది’’ అని ఓ ఇంటర్వ్యూలో రేవతి సంపత్‌ ఆరోపణలు చేశారు..మలయాళ చిత్రసీమలో మహిళల పని పరిస్థితులపై హేమ కమిటీ నివేదిక ఇవ్వడంతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి సినీ నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ రాజీనామా చేశారు. చిత్ర పరిశ్రమలోని మహిళల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల రావడతో కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story