డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సినీ నిర్మాతలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశమయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ కల్యాణ్​తో చర్చించారు. అంతే కాకుండా రాష్ట్రంలో సినీరంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Tolley wood
X

తెలుగు సినీ నిర్మాతలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం అయ్యారు. చిత్ర పరిశ్రమ ఎదర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు అవకాశలపై చర్చించమని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. టాలీవుడ్ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ కోరామన్నారు.. ఖరారు అయిన తర్వాత ఆయన్ను కలుస్తామని తెలిపారు. అప్పుడు అన్నింటికి సంబంధించి రిప్రజంటేషన్ ఇస్తామని చెప్పారు. ఏపీలో కూటమి ప్రభుత్వం సంతోషంగా ఉందన్నారు. డిప్యూటీ సీఎం అయినందుకు పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపామన్నారు. టికెట్ల రేట్లు చాలా చిన్న విషయమని చెప్పారు.

త్వరలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తామని అల్లు అరవింద్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్‌తో చర్చించారు. చిత్ర పరిశ్రమకు చెందిన పవన్‌కల్యాణ్‌ నటుడిగా ఎదిగి రాజకీయ రంగ ప్రవేశం చేసి , డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినందుకు గాను అభినందనలు తెలియజేయడానికి కూడా నిర్మాతలు మొదటిసారి పవన్‌ను కలువనున్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌‌ను నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌, నిర్మాతలు దిల్‌రాజ్‌ కలిసి సమస్యలను విన్నవించారు. అప్పటి మంత్రుల వ్యవహారశైలీతో ప్రముఖ నటులు తమ చిత్రాల విడుదల సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనుకూలమైన వ్యక్తులకు ఆంక్షల సడలింపు, వ్యతిరేకంగా కనిపించిన వారికి ఆంక్షలు విధించి విమర్శల పాలయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ నిర్మాతలు అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ పాల్గోన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story