గులాబీ, అనగనగా ఒకరోజు సినిమాల మాటల రచయిత కన్నుమూత

తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు

గులాబీ, అనగనగా ఒకరోజు సినిమాల మాటల రచయిత కన్నుమూత
X

టాలీవుడ్‌లో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ రచయిత నడిమింటి నరసింగరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఆయన ఇటీవల యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. యూసఫ్‌గూడ శ్మశానవాటిలో నరసింగరావు అంత్యక్రియలు జరగనున్నాయి.

కృష్ణవంశీ డైరెక్ట్‌ చేసిన మొదటి సినిమా గులాబీ, రాంగోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన అనగనగా ఒకరోజు సినిమాలకు ఆయన మాటల రచయితగా పనిచేశారు. సినిమాల్లోకి రాకముందు బొమ్మలాట నాటకంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. దూరదర్శన్‌లో ప్రసారమైన తెనాలి రామకృష్ణ ధారవాహికకు రచయితగా పనిచేశారు. సినీ, టీవీ, నాటక రచయిత అయిన నడిమింటి మృతిపట్ల ప్రముఖ రచయితలు పరుచూరు గోపాలకృష్ణ, ఉమర్జీ అనురాధ, డాక్టర్‌ నగరాజ గోపాలమూర్తి సంతాపం ప్రకటించారు. తెలుగు సినీ రచయితల సంఘం ఆయనకు నివాళులు అర్పించింది.

Raju

Raju

Writer
    Next Story