అల్లు అర్జున్‌ ఏమైనా పుడింగా? : ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌

ఆయన ప్రచారానికి వెళ్లిన ఒక్క చోటా గెలువలేదన్న ఎమ్మెల్యే

అల్లు అర్జున్‌ ఏమైనా పుడింగా? : ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌
X

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌, మెగా ఫ్యాన్స్‌ మధ్య వివాదం రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో అభిమానుల వరకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయాల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ అల్లు అర్జున్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సినీ హీరో అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్‌ ఏమైనా పుడింగా? అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ఘాటుగా విమర్శించారు. మెగా ఫ్యాన్స్‌ ఉన్నారని తెలుసు కానీ.. అల్లు ఫ్యాన్స్‌ ఉన్నారని తెలీదని సెటైర్లు వేశారు. అల్లు అర్జున్‌ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారు. ఆయన ప్రచారానికి వస్తే ఎంత? రాకపోతే ఎంత అని వ్యాఖ్యానించారు. ఆయన ప్రచారానికి వెళ్లిన ఒక్క చోటా గెలువలేదని బొలిశెట్టి గుర్తుచేశారు.

Raju

Raju

Writer
    Next Story