లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ 93 పాయింట్లు, నిఫ్టీ 28 పాయింట్లు అప్

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
X

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంటర్నేషన్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా.. దేశీయ మార్కెట్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. నిన్నటి ముగింపుతో పోల్చితే బాంబే స్టాక్ మార్కెట్ లో సెన్సెక్స్ 93 పాయింట్లు పెరిగి 81,146 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 24,839 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. డాలర్ పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.91 వద్ద ప్రారంభమైంది. రిలయన్స్, టాటా మోటార్స్, మారుతి, హెచ్యూఎల్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, ఎన్ టీపీసీ, టాటా స్టీల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్ , ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్ర, నెస్లే, ఐటీసీ, టైటాన్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Next Story