బంగారం, వెండి ప్రియులకు షాక్‌

దేశంలో పసిడి, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి.

బంగారం, వెండి ప్రియులకు షాక్‌
X

శ్రావణమాసం మొదలు కావడంతో శుభకార్యాలు, పెండ్లిల్ల నేపథ్యంలో దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల పసిడి ధర రూ. 72, 465 ఉండగా.. శనివారం నాటికి రూ. 1,005 పెరిగి రూ. 73,470కి చేరింది. శుక్రవారం వెండి ధర రూ. 84,062 ఉండగా.. శనివారం నాటికి రూ. 1,051 పెరిగి 85,113కు చేరుకున్నది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలలో పది గ్రాముల బంగారం ధర రూ. 73, 470 ఉండగా.. కిలో వెండి ధర రూ. 85,113 గా ఉన్నది.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

బంగారం ధరలు (24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 10 గ్రాములు)

ఢిల్లీలో రూ. 71,780, రూ. 65,810

బెంగళూరులో రూ. 71,630, రూ. 65,660

ముంబాయిలో రూ. 71,630, రూ. 68, 760

కోల్‌కతాలో రూ. 75,010, రూ. 65,660

చెన్నైలో రూ. 71,630, రూ. 65,660

ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు (కిలోకు)

ఢిల్లీలో రూ. 84,100

బెంగళూరులో రూ. 84,100

చెన్నైలో రూ. 89,100

పూణెలో రూ. 84,100

గమనిక: పుత్తడి, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించాలి.

Raju

Raju

Writer
    Next Story