ఆగస్టు 2న ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌

ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్టు 2 న సబ్ స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. ఆగస్టు 6 వరకు అందుబాటులో ఉంటుంది.

OLA
X

ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ సంస్థ ఓలా వచ్చే వారం ఐపీఓకు రానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 2వ నుంచి 6 వరుకు ఐపీఓ ప్రక్రియ జరగనుంది. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 5,500 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ తన వాటాను విక్రయిస్తున్నారు.ఈ ఐపీఓ విలువ 4.4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,500 కోట్లు) అని అంచనా. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు లేదా యాంకర్ ఇన్వెస్టర్లకు ఈ ఐపీఓ ఆగస్టు 1నే అందుబాటులకి రానుంది. ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ 37.9 మిలియన్ల షేర్లను విక్రయిస్తున్నారు. అయితే ఇంతకుముందు అంచనా వేసినదానికంటే ఇది 20 శాతం తక్కువే గమనార్హం. సింగపూర్ పెట్టుబడి సంస్థ టెమాసెక్ నేతృత్వంలో సెప్టెంబరులో ఓలాకు నిధులు సమకూరాయి.

అప్పటి మార్కెట్ విలువతో పోల్చితే ప్రస్తుత మార్కెట్ విలువ 18.5 శాతం నుండి 22 శాతం తక్కువగా ఉంది. ఆగస్టులో స్టాక్ మార్కెట్ అరంగేట్రం చేయనున్న ఓలా, ఈ ఏడాది వచ్చిన అతిపెద్ద ఐపీఓలలో ఒకటి కానుంది. ఓలా ఇప్పటికీ నష్టాల్లో ఉన్నప్పటికీ కంపెనీ స్థాపించిన మూడు సంవత్సరాల్లోనే ఈ-స్కూటర్లలో 46 శాతం మార్కెట్ వాటాను పొందింది. ఎన్డీయే ప్రభుత్వం కొన్ని పరిశ్రమ ప్రోత్సాహకాలను తగ్గించిన తర్వాత గతేడాది కంపెనీ విక్రయ లక్ష్యాలను తగ్గించుకుంది. భవీశ్ అగర్వాల్ వాటా వదులుకుంటున్న ఆఫర్ ఫర్ సేల్ కాకుండా ఐపీఓ ద్వారా రూ. 5,500 కోట్ల నిధులు సమకూర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఓలా మొదట 6-7 బిలయన్ డాలర్ల వాల్యుయేషన్ ని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఆ తర్వాత అంచనాలను తగ్గించుకుంది. డిసెంబర్ నాటి ఐపీఓ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 95.2 మిలియన్ షేర్లను కంపెనీ విక్రయించనుంది. ఆగస్టు 9 కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశముంది.

Vamshi

Vamshi

Writer
    Next Story