నిఫ్టీ మళ్లీ 24,300 ఎగువకు

వారం ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్‌ 1276.04 పాయింట్లు, నిఫ్టీ 350.2 పాయింట్ల చొప్పున లాభాలు నమోదు చేశాయి.

నిఫ్టీ మళ్లీ 24,300 ఎగువకు
X

రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు రాణించడంతో శుక్రవారం దేశీయ సూచీలు 1 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌ ఉదయం 1098 పాయింట్ల లాభంతో 79,984.24 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే ట్రేడైన సూచీ, చివరి 819,69 పాయింట్ల లాభంతో 79,705.91 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 250.50 పాయింట్లు పెరిగి 24,367.50 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల ర్యాలీ సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్లలో షాంఘై నష్టపోగా, మిగతావి లాభపడ్డాయి. ఐరోపా సూచీలు మెరుగ్గా ట్రేడయ్యాయి.

ఈ నెల 1న నిఫ్టీ సూచీ 25,00 పాయింట్ల అత్యున్నత శిఖరానికి చేరుకుని , అపైనే స్థిరపడింది. అదేరోజు ఇంట్రాడేలో 82,000 పాయింట్లపైకి చేరినా మళ్లీ కొంత కిందికి చేరుకుని తర్వాత మూడు రోజులు భారీగా నష్టపోయాయి. మళ్లీ కోలుకున్నాయి.వారం ప్రాతిపదికన చూస్తే సెన్సెక్స్‌ 1276.04 పాయింట్లు, నిఫ్టీ 350.2 పాయింట్ల చొప్పున లాభాలు నమోదు చేశాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు పెరిగి 83.95 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 79 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story