వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే సూచీలు

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 79,000 పాయింట్ల దిగువకు చేరింది.

వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే సూచీలు
X

వరుసగా రెండో రోజు సూచీలు నష్టాల్లో కొనసాగాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 79,000 పాయింట్ల దిగువకు చేరింది. విదేశీ అమ్మకాలు ప్రతికూల ప్రభావం చూపాయి.సెన్సెక్స్‌ ఉదయం 96 పాయింట్ల నష్టంతో 79,552.51 వద్ద ప్రారంభమైంది.తర్వాత లాభాల్లోకి వచక్చి 79,692,55 వద్ద గరిష్టాన్ని తాకింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో నష్టాలోకి వెళ్లిన సెన్సెక్స్‌ 693 పాయింట్ల నష్టంతో 78,956.03 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయి 24,139 పాయింట్ల వద్ద స్థిరపడింది.

సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం ఒక్కరోజే రూ. 4.52 లక్షల కోట్లు తగ్గి రూ. 445.30 లక్షల కోట్ల (5.30 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.97 వద్ద స్తబ్దుగా ముగిసింది. ముడిచమురు 0.35 శాత నష్టంతో 82 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story