ఐఐటీ బాంబే: 22 మందికి కోటికి పైగా ప్యాకేజీ

1,475 మందికి జాబ్‌ ఆఫర్లు..ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోనే భారీగా జాబ్‌ ఆఫర్లు

ఐఐటీ బాంబే: 22 మందికి కోటికి పైగా ప్యాకేజీ
X

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ బాంబే దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటి. ఇందులో విద్యను అభ్యసించిన వారికి భారీ ప్యాకేజీలతో నేషనల్‌, ఇంటర్నేషన్‌ కంపెనీల నుంచి ఆఫర్‌ లెటర్స్‌ వచ్చాయి. ఇందులో 22 మంది రూ. కోటిపైనే వార్షిక వేతనాలతో ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం.

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్‌మెంట్స్‌ నివేదిక విడుదలైంది. పలు నేషనల్‌, ఇంటర్నేషన్‌ కంపెనీల్లో ఉద్యోగాల కోసం 2,414 మంది రిజిస్టర్‌ చేసుకున్నారు. వారిలో 1,979 మంది మాత్రమే యాక్టివ్‌గా పాల్గొన్నారు. వీరిలో 1,475 మంది ఆఫర్లను అంగీకరించినట్లు ఐఐటీ బాంబే వెల్లడించింది. విద్యార్థుల సగటు వార్షిక వేతనం రూ. 23,50 లక్షలు కాగా.. మధ్యస్థ వేతనం 17.92 లక్షలుగా ఉన్నదని తెలిపింది. వీరిలో 22 మంది విద్యార్థులు రూ. కోటి, అంతకుమించి వార్షిక వేతన ప్యాకేజీతో ఉద్యోగాలు అంగీకరించారు. 78 మంది విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు పొందారని వెల్లడించింది. సుమారు 364 కంపెనీలు 1,650 ఉద్యో గాలను ఆఫర్‌ చేయగా.. ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలోనే భారీగా జాబ్‌ ఆఫర్లు వచ్చినట్లు తెలిపింది.

Raju

Raju

Writer
    Next Story