నీట్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి : మంత్రి శ్రీధర్ బాబు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వంద వైఖరితో వ్యవహరిస్తున్నాడని,నూతన గనులను ప్రైవేటు వ్యక్తుల చేతికి కట్టబెట్టే పనిలో కేంద్రం ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు

By :  Vamshi
Update: 2024-06-20 10:06 GMT

నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. నీట్ ఎగ్జామ్‌కు సంబంధించి అవకతవకలపై ప్రధాని మోదీ స్పందించాలని మంత్రి డిమాండ్ చేశారు. 63 మంది విద్యార్థులకు ఒకటే ర్యాంకు వచ్చిందన్నారు. స్టూడెంట్స్ అన్యాయం జరగొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున డిమాండ్ చేస్తున్నామని సీబీఐతో విచారణ జరిపించాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో ప్రధానంగా వైద్య విద్యలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు. గ్రేస్ మార్కులను కలపడంపై కూడా అనుమానాలు ఉన్నాయని తెలిపారు.

నీట్‌పై విద్యార్థులకు మళ్లీ నమ్మకం కలిగేలా కేంద్రం ఈ విషయంలో వ్యవహరించాలని సూచించారు.గనుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక విషయం చెబుతున్నాను. లాభాల్లో నడుస్తున్న సంస్థ సింగరేణి సంస్థ. కార్మికుల నైపుణ్యంతో ఆ సంస్థ చాలా బలంగా ఉంది. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నట్లు కిషన్ రెడ్డి చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే చేయాలి. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పునరాలోచన చేయాలి. ఓవైపు సింగరేణిని ప్రైవేటుపరం చేయమంటూనే మరోవైపు ప్రైవేటు వ్యక్తుల చేతికి కట్టబెట్టే పనిలో కేంద్రం ఉంది. అన్ని బొగ్గు నిక్షేప సంస్థలు లాభాల్లో ఉన్నాయి.' అని శ్రీధర్ బాబు అన్నారు.

Tags:    

Similar News